ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభోవీధిపై నంతైన రాంషా జీవన పథం
రాంషా గారు జన్మించినది 1924 జూలై 30వ తేదీన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పక్కన వేట్లపాలెంలో. తల్లితండ్రులు శ్రీమతి వేంకటరత్నం, దర్భా వేంకటరమణయ్య గార్లు పెట్టిన పేరు వేంకట రామశాస్త్రి. ఆయన ఏకైక తోబుట్టువు అక్కగారు కీ.శే. శ్రీమతి రుక్మిణీ పేరమాంబ గారు. పుట్టటం ఐశ్వర్యంలోనే పుట్టినా ఆ తరువాత కుటుంబ పరిస్థితుల వల్ల రామశాస్త్రి గారి జీవితం విద్యాభ్యాసం మొదలుకొని మధ్య వయస్సు దాకా పేదరికంలోనూ, సమస్యల ముళ్ళబాటలోనూ గడిచింది. తల్లిప్రేమకు లేత వయసులోనే దూరమై పెదతల్లి పెంపకంలో అనాదరణ అనుభవించాల్సి వచ్చింది. దానితో చిన్నవయసులోనే గ్రంధ పఠనాన్ని ఆశ్రయించడం జరిగింది. అంతర్ముఖత, ఒంటరితనం ఆ రోజుల్లోనే అలవడ్డాయి. రాంషాగారి విద్యాభ్యాసం స్కూలు ఫైనల్ వరకూ…