Articles on Ramsha

లైంగిక విజ్ఞాన దిక్సూచి – రాంషా

– అమ్మిన శ్రీనివాసరాజు. 26 జూలై 2009 – ఆదివారం ఆంధ్రప్రభ. జూలై 30 రాంషా 85వ జయంతి సందర్భంగా.. స్త్రీ భావాలకూ, ఆలోచనలకూ, అంత ప్రాధాన్యమివ్వని నేటి పురుషాధిక్యసమాజంలో, అనేక వైవాహికసమస్యలు ఎదురవు తుంటాయి. వైవాహికజీవితానికి బలమైన కవచమైన లైంగికవిజ్ఞానశక్తితో సాంసారికంగా సర్దుబాట్లు చేసుకోవచ్చని నమ్మిన వ్యక్తి, దుర్వ్యసనాలకు చేరువై తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్న యువతరం బాగుకోరి శాస్త్రీయమైన లైంగికవిజ్ఞానం అందించిన తెరువరి, వేలాదిమంది జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు, తెలుగు పత్రికారంగంలో వెలువడిన తొలి లైంగిక విజ్ఞానపత్రిక ‘అభిసారిక’ సంపాదకుడు-ఇలా బహుముఖీన ప్రజ్ఞాపాటవాలు కనబరిచిన సాహితీమూర్తి, రాంషా అసలు పేరు దర్భా వెంకటరామశాస్త్రి. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట – సమీపంలోని…

Continue reading

Stories

చిదంబర రహస్యం 

కథానికః ఆంధ్ర పత్రిక – సచిత్రవారపత్రిక 16-5-1951. ఉండి ఉండి ఖమ్మం మెట్టు కాని స్టేబుల్ బుర్రలోబుద్ధి వక్రించి పెంపొందటం ప్రారంభించింది. అన్నీ కలుపుకొని నెలకి సుమారు ఏభై రూపాయల అధికార వేతనంతో ఎవడూ కానిస్టేబుల్ కాలేడని అతగాడు విశ్వసించటం ప్రారంభించాడు. ధర్మంగా తన డ్యూటీ పూర్తి చేసుకొంటే జూదగాడి నుంచి గజదొంగదాకా బుర్ర నిబట్టి ఒకటి నుంచి పదిరూపాయలదాకా భత్యం దొరక్క పోదు. అయితే ఆది కష్టానికి తగ్గ ఫలం మాత్రం కాదు. ఇంక ఎటొచ్చీ సాధారణంగా అందరికీ కనిపించే ఇద్దరెక్కిన సైకిళ్లు, రాంగు సైడు కార్లు, లైసెన్సు లేని కండక్టర్లు, దీపాలు లేని జట్కాలు ఇవి ఉన్నాయి. వీటివల్ల తను ఎంత కక్కూర్తిపడ్డా…

Continue reading

Stories

శత్రువులు 

మూలం : ఛఖోవ్.                                                                                  అనువాదం: రాంషా. రాత్రి పదిగంటలవుతుంది. డాక్టర్ సదాశివం గారి ఒకే ఒక్కకొడుకు, ఆరేళ్ళ రంగారావు, మసూచి వచ్చి చచ్చిపోయాడు. ఆ పసిబిడ్డడి తల్లి అతని మంచంకోళ్ళ దగ్గర కూర్చుని నిరాశతో సొమ్మసిల్లిపోయింది. అదే సమయాన వీధితలుపు ఎవరో బాదుతున్నారు. బిడ్డడికి మసూచి వచ్చినప్పట్నుంచీ, డాక్టర్ కనుక, నౌకర్ల నెవళ్ళనీ ఇంటికి రానివ్వటంలేదు. చేతిలో స్టెతస్కోపు అలానే వుంది; సూటింకా విప్పనే లేదు. చెమట్లుకమ్మిన నుదురు తుడుచుకోనన్నా లేదు. అలాగే తిన్నగా వీధితలుపుదగ్గిరికి వెళ్ళాడు. హాలంతా చీకటిగా ఉంది. ఇక ఆ వచ్చిన ఆసామీ ఎత్తుతప్ప ముఖ కవళిక లేమి స్పష్టంగా కనిపించలేదు. పాలిపోయిన ముఖం, ఆ ముఖమే ఆ హాలుకి కాంతి…

Continue reading

Stories

కిర్రు చెప్పులు 

ఆంధ్ర పత్రిక – సచిత్రవారపత్రిక 6-6-1951 రాంషా కథానిక : అతన్ని నేను బాగా ఎరుగుదును, మా బళ్ళోకి వెళ్లేదారిలో అరుగుమీద కూర్చుని అతను జోళ్లు కుట్టేవాడు. అతన్ని నేను బాగా ఎరుగుదును. అతను కుట్టిన జోళ్లుమాత్రం ఆ ఊరివారందరికీ బాగా తెలుసు. అతని ముఖం ముందు కాకపోయినా చాటుగానన్నా వాటి శ్రేష్ఠతను గురించి నలుగురూ కచేరీ సావిట్లో కూర్చొని చెప్పుకొనేవారు. అప్పడు జోడు కుట్టడం తడువు ఎవరిమటుక్కు వారే పోటీలు పడి పట్టుకుపోయేవారు. అతన్ని మొదటిసారిచూసింది నా ఆరో ఏట. అప్పటి జోళ్ల మన్నికనీ, వాటి చౌక తనాన్నీ ప్రశంసించేవారయితే చాలామంది ఉన్నారుగాని అప్పడి జీవిత రహస్యాన్నీ, అతని జీవిత తత్వాన్నీ తెలిసిన వాళ్లు…

Continue reading

Articles on Ramsha

అజరామరుడు

– బులుసు సూర్య ప్రకాశం 23.2.90. రాంషాగారు పోయేరట యాక్సిడెంటు అయి! ఎవరన్నారు? ఆయన పోవడం ఏమిటి? ఎవరేమిటి? పత్రికలు, రేడియోలు, టి.వీలు ఘోషిస్తున్నాయి. అభిసారిక పత్రికాధిపతి రాంషా కారు మీద రాజమండ్రి వెడుతూ యాక్సిడెంటు అయి అక్కడికక్కడే కన్ను మూసేరని. ఇదిగో! పత్రికలు, రేడియోలు, టి.వీలు ఏం చెప్పినా రాంషాగారు పోవటం అన్నది కల్ల. చావు అన్నది నీకూ నాకూ వస్తుంది. రాంషాగారికి కాదు. వాల్మీకి, వ్యాసుడు, షేక్స్పియరు, కాళిదాసు – ఇలాంటివారు మరణించరు. వాల్మీకి మాటలు ఆయన రామాయణం ద్వారా మనకు వినిపిస్తూనే ఉన్నాయి. వ్యాసుడు తన రచనల ద్వారా ఉపదేశిస్తూనే ఉన్నాడు. షేక్స్పియరు, కాళిదాసు తమ నాటకాలలో కనిపిస్తూనే ఉన్నారు. వాళ్ళకు…

Continue reading

Stories

కొడిగట్టిన దీపాలు

రచన : రాంషా. కామేశం వ్రాసిన ఉత్తరాన్ని సరోజ చదువుతోంది…. “నువ్వు లేక పోతే నేను లేనట్టే. దుర్బరమైన నా ఒంటరి జీవితాన్ని తలుచుకొవి కుమిలిపోతూ ఆ అంధకారంలో నువ్వే ఒక్క ఆశాజ్యోతి వనుకుంటున్నాను… నాకు నువ్వుకావాలి… నాకు ఊపిరికావాలని, ప్రాణంకావాలని, జీవం కావాలని ఎంత సహజంగా వాంఛిస్తానో అలాగే నువ్వు కావాలని కూడా….. అవి లేకపోతే నేనెల్లా బతకలేనో నువ్వులేకపోతే కూడా అలానే. ఈచీకట్లో?… ఈ దోమలతో…” కామేశం వ్రాసిన ప్రతీ అక్షరమూ  అతని గుండెల్లో రగిలిన దుఃఖాన్ని వ్యక్తంచేస్తున్నాయి. కామేశం మోకాళ్ల మీద తల పెట్టుకొని కళ్లనీళ్లు పెట్టుకొన్నట్లు, భోజనం మాని సత్యాగ్రహం చేసి కృశించి పోతున్నట్టు, ఇకనైనా ఆమె తన జవాబుతో…

Continue reading