అరుణతార పొడిచింది
శ్రీ రాంషా. అభ్యుదయ పత్రిక నవంబర్ 1946. బోయీల్ మోసే పూలపల్లకీ! కూలీల్ కట్టిన రాజభవపనమా! రాజులు ఎక్కే సింహాసనమా! న్యాయం చెప్పే మునసబులారా! స్వేచ్ఛను అణచే జైలధికారీ! గుర్తించండోయ్ గుర్తించండి; మీ బధిరాంధక అధికారంలో అడుగున నలిగీ, ప్రక్కకు అణిగీ రోదించే ఆ బానిసజీవుల ఆక్రందన ఆర్తరావం గుర్తించండోయ్ గుర్తించండి. మీ బధిరాంధక అధికారంలో స్వార్ధంతో చేసిన మీ ద్రోహం అణచిందీ అమాయకుల్ని . రాచఱికం నాదేనంటూ తలపోసే సైనిక ఖడ్గాల్ స్వతంత్రమే నాదేనంటూ బంధించే ఇనుప గొలుసులూ, అధికారం నాదేనంటూ ఉరివేసే దండననీతీ, మహరాజుల భూషణమ౦టూ సామాన్యుని పీల్చే తురాయి కొరడాలు, తుపాకిగుండ్లూ ఇవ్వన్నీ రాజరికాలా ? –ఇవ్వన్నీ ఇకపై నిలవవు. సామాన్యుని…