లైంగిక విజ్ఞాన దిక్సూచి – రాంషా
– అమ్మిన శ్రీనివాసరాజు. 26 జూలై 2009 – ఆదివారం ఆంధ్రప్రభ. జూలై 30 రాంషా 85వ జయంతి సందర్భంగా.. స్త్రీ భావాలకూ, ఆలోచనలకూ, అంత ప్రాధాన్యమివ్వని నేటి పురుషాధిక్యసమాజంలో, అనేక వైవాహికసమస్యలు ఎదురవు తుంటాయి. వైవాహికజీవితానికి బలమైన కవచమైన లైంగికవిజ్ఞానశక్తితో సాంసారికంగా సర్దుబాట్లు చేసుకోవచ్చని నమ్మిన వ్యక్తి, దుర్వ్యసనాలకు చేరువై తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్న యువతరం బాగుకోరి శాస్త్రీయమైన లైంగికవిజ్ఞానం అందించిన తెరువరి, వేలాదిమంది జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు, తెలుగు పత్రికారంగంలో వెలువడిన తొలి లైంగిక విజ్ఞానపత్రిక ‘అభిసారిక’ సంపాదకుడు-ఇలా బహుముఖీన ప్రజ్ఞాపాటవాలు కనబరిచిన సాహితీమూర్తి, రాంషా అసలు పేరు దర్భా వెంకటరామశాస్త్రి. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట – సమీపంలోని…