Poetry

అరుణతార పొడిచింది

శ్రీ రాంషా. అభ్యుదయ పత్రిక నవంబర్ 1946. బోయీల్‌ మోసే పూలపల్లకీ! కూలీల్‌ కట్టిన రాజభవపనమా! రాజులు ఎక్కే సింహాసనమా! న్యాయం చెప్పే మునసబులారా! స్వేచ్ఛను అణచే జైలధికారీ! గుర్తించండోయ్‌ గుర్తించండి; మీ బధిరాంధక అధికారంలో అడుగున నలిగీ, ప్రక్కకు అణిగీ రోదించే ఆ బానిసజీవుల ఆక్రందన ఆర్తరావం గుర్తించండోయ్‌ గుర్తించండి. మీ బధిరాంధక అధికారంలో స్వార్ధంతో చేసిన మీ ద్రోహం అణచిందీ అమాయకుల్ని . రాచఱికం నాదేనంటూ తలపోసే సైనిక ఖడ్గాల్‌ స్వతంత్రమే నాదేనంటూ బంధించే ఇనుప గొలుసులూ, అధికారం నాదేనంటూ ఉరివేసే దండననీతీ, మహరాజుల భూషణమ౦టూ సామాన్యుని పీల్చే తురాయి కొరడాలు, తుపాకిగుండ్లూ ఇవ్వన్నీ రాజరికాలా ? –ఇవ్వన్నీ ఇకపై నిలవవు. సామాన్యుని…

Continue reading

Poetry

అడగకండి బాబూ!

-రాంషా అభ్యుదయ పత్రిక జనవరి 1956 అడగకురా, ప్రియసఖుడా! ఆదర పూర్వక వాక్కుల అయ్యో ఓరయ్యో, నే చెప్పలేను భయ్యా! ఇది సృజించె కల్లోలం, నా నిర్మల హృదయంలో ఇది విధించె ప్రావాసం, ఇష్టుల ఆప్తులనుండి. విధి విధాత విడ్డురముగ విధించెనో నా నుదుటను ఈ రహస్య వేదనయే రగుల్కొనెడు నా యెడంద; తీర మింత కనిపించని సంద్రమురా నా చుట్టూ తెడ్డు విరిగి ఒడ్డెరుగని జీవనౌక, ఆకట్టు. నేను వినే, నేను కనే, నేను కలియు అన్నింటా అన్నింటా ఒకే విసుగు ఒకే కసరు అన్నింటా ఏ సుందర దృశ్యమైన అందదురా నా ముందర ఆలి కంటి మెరుపుల్లో అయిపురాదు ఆనందం దేని కింత…

Continue reading

Poetry

జయహే!

జయహే భారత జననీ జయహే …   సస్యశ్యామల స్నిగ్ధ సుశోభిత పరిచేలాంచలధారీ … జ||   అంబరచుంబిత హిమవన్నగమణి మండిత మకుట ధరిత్రీ … జ||   గంగాయమునా పుణ్య నదీజల పావన దుగ్ధ ప్రదాయీ … జ||   అగణిత భారత దు:ఖిత జనపద పీడిత హృదయవిహారీ … జ||

Continue reading