చిదంబర రహస్యం
కథానికః ఆంధ్ర పత్రిక – సచిత్రవారపత్రిక 16-5-1951. ఉండి ఉండి ఖమ్మం మెట్టు కాని స్టేబుల్ బుర్రలోబుద్ధి వక్రించి పెంపొందటం ప్రారంభించింది. అన్నీ కలుపుకొని నెలకి సుమారు ఏభై రూపాయల అధికార వేతనంతో ఎవడూ కానిస్టేబుల్ కాలేడని అతగాడు విశ్వసించటం ప్రారంభించాడు. ధర్మంగా తన డ్యూటీ పూర్తి చేసుకొంటే జూదగాడి నుంచి గజదొంగదాకా బుర్ర నిబట్టి ఒకటి నుంచి పదిరూపాయలదాకా భత్యం దొరక్క పోదు. అయితే ఆది కష్టానికి తగ్గ ఫలం మాత్రం కాదు. ఇంక ఎటొచ్చీ సాధారణంగా అందరికీ కనిపించే ఇద్దరెక్కిన సైకిళ్లు, రాంగు సైడు కార్లు, లైసెన్సు లేని కండక్టర్లు, దీపాలు లేని జట్కాలు ఇవి ఉన్నాయి. వీటివల్ల తను ఎంత కక్కూర్తిపడ్డా…